Fahadh Faasil | అల్లు అర్జున్ ‘పుష్ప’ క్లైమాక్స్ చూసిన ఎవరైనా అనుకునేమాట ఒక్కటే.. ‘మన పుష్పరాజ్ పెనెం మీదనుంచి పొయ్యిలో పడ్డాడు’ అని. సినిమా అంతా దొంగల్ని కొల్లగొట్టిన గజదొంగలా కనిపిస్తాడు పుష్పరాజ్. కానీ చివర్లో ఓ శాడిస్ట్ పోలీసోడి చేతిలో పడటం ఏదైతే ఉందో.. ఆ పాయింటే ‘పుష్ప-2’పై ఆసక్తిని రెట్టింపు చేసింది. క్లైమాక్స్‌లో రెండు సీన్లు మాత్రమే కనిపించినా ‘భన్వర్‌సింగ్ షెకావత్’ పాత్ర ఎంత ప్రమాదకరమైందో, సెకండాఫ్‌లో పుష్పరాజ్ పడే అవస్థలెలా ఉంటాయో కేవలం ఎక్స్ప్రెషన్తోనే చెప్పేశాడు మలయాళ అగ్ర నటుడు ఫహాద్ ఫాజిల్.
ఇప్పుడు ఇదంతా దేనికంటే.. నేడు ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు ఈ సందర్భంగా ‘పుష్ప 2’ నుంచి భన్వర్సింగ్షెకావత్ ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. పోలీస్ డ్రెస్‌లో కాకుండా లుంగీ కట్టుకొని మాస్ లుక్‌తో భన్వర్‌సింగ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో గన్. ఈ స్టిల్‌ని బట్టి.. భన్వర్‌సింగ్ షెకావత్ రివెంజ్‌ని దర్శకుడు సుకుమార్ ఎలా డిజైన్ చేశాడా.. అనే ఆసక్తి ఆడియన్స్‌లో మరింత పెరిగింది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్.