Pushpa 2 | ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన పుష్ప: ది రైజ్ కు సీక్వెల్‌గా వచ్చిన పుష్ప: ది రూల్ మరోసారి ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అఖండ విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు జపాన్ మార్కెట్‌పై కూడా దృష్టి సారించింది.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై దాదాపు ₹500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన పుష్ప 2, రిలీజ్‌కు ముందే ₹650 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ను సాధించింది. ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ₹275 కోట్లకు సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో యూ/ఏ సర్టిఫికేట్‌తో విడుదలైన ఈ చిత్రం 200 నిమిషాల రన్టైమ్తో థియేటర్లలో దుమ్మురేపింది.
రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన పుష్ప 2, అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.నైజాం: ₹104 కోట్లు, ఆంధ్రా: ₹122 కోట్లు నెట్ (గ్రాస్ ₹346 కోట్లు),కర్ణాటక: ₹53 కోట్లు, తమిళనాడు: ₹35 కోట్లు, కేరళ: ₹7.6 కోట్లు, హిందీ వెర్షన్: ₹390 కోట్లు, ఓవర్సీస్: ₹130 కోట్లు ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ₹1775 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సెన్సేషన్‌గా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, చిత్ర బృందం ఈ సినిమాను ఇప్పుడు జపనీస్ భాషలో విడుదల చేయడానికి సిద్ధమైంది.ఇందుకోసం గీక్ పిక్చర్స్, షోచికు డిస్ట్రిబ్యూషన్ సంస్థలతో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
జపాన్‌లో ఈ చిత్రం పుష్ప కుర్నిన్( Pushpa Kunrin) పేరుతో విడుదల కానుంది. జనవరి 16,2025న రిలీజ్ ప్లాన్ చేశారు. రికార్డు సంఖ్యలో స్క్రీన్లు బుక్ చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.అల్లు అర్జున్ ప్రత్యేకంగా జపాన్ అభిమానులకు, కొన్నిచివా నిహోన్ నో తోమో యో” (జపాన్ స్నేహితులారా నమస్కారం) అని సందేశం పంపడం మరింత ఆకర్షణగా మారింది. జపనీస్ ట్రైలర్, కొత్త పోస్టర్లు, స్టిల్స్ విడుదల కాగా, సోషల్ మీడియాలో అవి భారీగా వైరల్ అవుతున్నాయి. జపాన్‌లో మూవీకి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ కూడా జపాన్ విడుదలపై భారీ ఆశలు పెట్టుకున్నారు.