Sreeleela | ‘కిస్సిక్’ అంటూ ‘పుష్ప2’లో శ్రీలీల చేసిన సందడి అంతా ఇంతాకాదు. తనందులో చేసింది ఓ పాటే అయినా.. హీరోయిన్‌కి వచ్చినంత పేరొచ్చింది. అయితే.. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం శ్రీలీల కెరీర్లో తొలి ఐటమ్ సాంగ్.. చివరి ఐటమ్ సాంగ్ కూడా ‘కిస్సిక్’ సాంగేనట. ఇక జీవితంలో తను ఐటమ్ నంబర్ చేయదని తెలుస్తున్నది. నిజానికి చిరంజీవి ‘విశ్వంభర’లో కూడా ఓ ఐటమ్ సాంగ్‌కి శ్రీలీలను అడిగారు.
ఆ ఆఫర్‌ని తను సున్నితంగా తిరస్కరించిందని ఫిల్మ్‌వర్గాల భోగట్టా. అయితే.. ‘పుష్ప2’కు ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని, తొలి పార్ట్‌లో సమంత ఐటమ్‌సాంగ్ చేసింది కాబట్టి, మలి పార్ట్‌లో తాను చేయడం సబబేనని భావించి ఈ పాటను శ్రీలీల అంగీకరించిందని తెలుస్తున్నది. రీసెంట్గా ఇలాంటి ఆఫర్లు ఎన్ని వస్తున్నా.. ఎంత పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నా శ్రీలీల మాత్రం కేర్ చేయడం లేదట.
‘చేస్తే హీరోయిన్‌గానే చేస్తా.. లేకపోతే ఖాళీగా ఉంటా.. అంతేకానీ.. ఐటమ్ సాంగ్స్ మాత్రం చేయను’ అని ఖరాకండీగా చెప్పేస్తున్నదట. ఈ నెల 25న నితిన్‌కు జోడీగా ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమా విడుదల కానుంది. అంతేకాక, తమిళంలో శివకార్తికేయన్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నది శ్రీలీల.