Pushpa 2 The Rule | పుష్ప 2 సినిమాతో ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం థాంక్యూ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించిన సందర్భంగా ప్రేక్షకులతో పాటు తన అభిమానులకు చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఈ వేడుకలో కమెడియన్ సునీల్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అల్లు అర్జున్ వరల్డ్ వైడ్ కాకుండా పాకిస్థాన్ వరకు రీచ్ అయ్యింది. నేను ఒక సినిమా కోసం స్పెయిన్ వెళ్లినప్పుడు అర్థరాత్రి 2 అవుతుంది. అప్పటికి మా టీమ్ మొత్తం చాలా ఆకలిగా ఉన్నాం. అయితే ఒక కబాబ్ రెస్టారెంట్ ఉంది అంటే మన ఇండియన్ రెస్టారెంట్ అనుకొని వెళ్లాం. కానీ అది పాకిస్థాన్ వాళ్లది. వాళ్లు నన్ను చూసి పుష్ప ఇంటర్వెల్ క్లైమాక్స్ పెట్టి మంగళం శ్రీను మీరే కదా అని కబాబ్ రెస్టారెంట్ ఓనర్ అడిగాడు. అప్పుడే అర్థం అయ్యింది పుష్ప క్రేజ్ పాకిస్థాన్ వరకు వెళ్లిందని. ఆయన మమ్మల్ని తన రెస్టారెంట్లోకి తీసుకువెళ్లి దగ్గరుండి అన్ని తినిపించి.. ఆ తర్వాత వాళ్ల ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడిపించాడు. అప్పుడే అనిపించింది. నాకు ఈ గుర్తింపు పుష్ప సినిమాతో వచ్చిందని.. ఈ విషయం నేను ఎప్పటికి మర్చిపోలేను అంటూ సునీల్ చెప్పుకోచ్చాడు.
#Pushpa2 craze has spread like wildfire around the world!#AlluArjun should carefully choose his next projects to appeal to a global audience. At the same time, he shouldn’t take too long to finalize them in order to perfectly capitalize on this craze.
pic.twitter.com/Oc8qawzawA— Telugu Chitraalu (@TeluguChitraalu) February 8, 2025