Pushpa 2 | దేశంలోని సినీ ప్రేమికులంతా విడుదలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప 2’ ఒకటి. అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన ‘పుష్ప’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదల కానుంది. అంటే.. సరిగ్గా 50రోజుల్లో పుష్పరాజ్ మళ్లీ వెండితెరపై ప్రత్యక్షం కానున్నాడన్నమాట. ఈ సందర్భంగా బన్నీ మాసివ్ లుక్‌తో ఉన్న పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. సింహాసనాన్ని అధిష్టించిన పుష్పరాజ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. పుష్పరాజ్ రూల్కి కౌంట్స్టార్ట్ అయ్యిందని, ఇందులోని ప్రతి సన్నివేశం గూజ్బంప్స్ తెప్పిస్తుందని, ప్రేక్షకుల ఊహలకు అందని స్థాయిలో సినిమా ఉండబోతున్నదని మేకర్స్ తెలిపారు.
దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారనీ, తొలిపార్ట్ని తలదన్నేలా ఆయన టేకింగ్ ఉంటుందని, దేవిశ్రీ సంగీతం, మిరోస్లా క్యూబా బ్రోజెక్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలైట్ కానున్నాయని మేకర్స్ తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర పాత్రధారులు.