Pushpa 2 Book My Show | వరల్డ్ వైడ్‌గా మరో 8 రోజుల్లో పుష్ప గాడి హవా మొదలు కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘పుష్ప ది రూల్’ పేరే వినిపిస్తోంది. విడుదలకు ఇంకా 8 రోజులే ఉండడంతో పెండింగ్ పనులు కంప్లీట్ చేస్తుంది టీం. ఇదిలావుంటే ఈ సినిమా బుక్ మై షోలో అరుదైన రికార్డును సాధించింది. విడుదలకు ముందే ఈ చిత్రం బుక్ మై షోలో 1 మిలియన్ ఇంట్రెస్ట్‌లను సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం ఎక్స్‌లో ప్రకటించింది. మరోవైపు పేటీఎంలో కూడా 1.3 మిలియన్ ఇంట్రెస్ట్‌లను సాధించింది ఈ చిత్రం.
ఇక బుక్ మై షోలో ఇప్పటివరకు 1 మిలియన్ ఇంట్రెస్ట్‌లను క్రాస్ చేసిన సినిమాలను చూసుకుంటే కన్నడ నుంచి వచ్చిన కేజీఎఫ్ 2.. 2.1 మిలియన్ ఇంట్రెస్ట్‌లతో మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత అజిత్ నటించిన వలిమై చిత్రం 2.1 మిలియన్ ఇంట్రెస్ట్‌లను దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ 1.75 మిలియన్, బాహుబలి 1.1 మిలియన్ ఇంట్రెస్ట్‌లను దక్కించుకున్నాయి. అయితే పుష్ప విడుదలకు ఇంకా వారం రోజులు ఉండడంతో ఆర్ఆర్ఆర్ సినిమాను దాటబోతున్నట్లు తెలుస్తుంది.
THE BIGGEST INDIAN FILM is the most anticipated films among the audience ❤️🔥#Pushpa2TheRule clocks a massive 1 MILLION+ INTEREST on @bookmyshow and 1.3 MILLION+ INTERESTS on @Paytm 🔥🔥
GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 5TH 💥#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun… pic.twitter.com/vggSfGay2O
— Pushpa (@PushpaMovie) November 27, 2024