వివాహానంతరం పురుషులు పడే అవస్థలు, వారి జీవితంలో చోటుచేసుకునే మార్పులను వినోదాత్మకంగా చూపిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘పురుషః’. పవన్‌కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నాడు. వీరు వులవల దర్శకుడు. బత్తుల కోటేశ్వరరావు నిర్మాత. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేశారు.
ప్రతీ సీన్లో చక్కటి కామెడీ పండిస్తూ టీజర్ సాగింది. ‘మగజాతి ఆణిముత్యాలండీ మీరు..’ అనే డైలాగ్‌తో టీజర్‌ను ముగించారు. భార్యభర్తల అనుబంధంతో పాటు వారి మధ్య గిల్లికజ్జాలను హాస్యప్రధానంగా ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్.