Puri- Sethupati | ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనే ట్యాగ్‌తో ఎదిగిన పూరీ జగన్నాథ్, తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. వరుస ఫ్లాపుల అనంతరం తెలుగు హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో, పూరీ ఇప్పుడు కోలీవుడ్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మరి ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి . ఫ్లాపుల్ని పక్కన పెట్టి కథ నచ్చితే ఎలాంటి డైరెక్టర్‌కైనా ఓకే చెప్పే విజయ్ సేతుపతి.. పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. కథలోని పాత్ర విజయ్ సేతుపతి కి బాగా నచ్చడంతో, స్టార్ డైరెక్టర్ ఫామ్ లో లేకపోయినా ఆయన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
పూరీ జగన్నాథ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ & టైటిల్ టీజర్‌ను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు, ఈ సందర్భంగా పూరీ దర్శకుడిగా ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుండడం విశేషం.ఈ సినిమాకు “బెగ్గర్” అనే టైటిల్ చర్చలో ఉంది. పూరీ మార్క్ డైలాగులు, మాస్ ట్రీట్మెంట్, డిఫరెంట్ హీరో క్యారెక్టర్ అంటూ ఈ సినిమా మీద పూరీ అభిమానులకే కాదు, విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌కి కూడా భారీ అంచనాలున్నాయి.
కాస్టింగ్, మ్యూజిక్ డైరెక్టర్, కథ నేపథ్యం లాంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని సమాచారం. బడా టెక్నికల్ టీం ఈ సినిమా కోసం పని చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇటీవల సినిమాలు టైటిల్ టీజర్‌తోనే బజ్ క్రియేట్ చేస్తున్న తరుణంలో, పూరీ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి టీజర్‌తోనే పవర్ఫుల్ ఇంపాక్ట్ ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. విజయ్ సేతుపతితో పూరీ చేసే సినిమా ఎలా ఉంటుందా అన్న ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో ఉంది. కథ ఏమాత్రం బాగున్నా విజయ్ సేతుపతి అదరగొట్టేయడం ఖాయం