Puri Jagannadh | టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ మరో కొత్త పాడ్ కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరీ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫిలాసఫీ పేరిటా పాడ్ కాస్ట్‌లు చేస్తాడన్న విషయం తెలిసిందే. పూరి మ్యూజింగ్స్(Puri Musings) అనే పేరుతో పూరీ తన భావాలను వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు. ఈ విషయాలను యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. గత వారం ‘స్లో లైఫ్’ అనే అంశంపై మాట్లాడిన పూరీ తాజాగా మరో కొత్త ఫిలాసఫీతో మందుకు వచ్చాడు. ఈ వారం ‘ప్లాన్ బీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక్కడ ఎవడి జీవితం ఎవడి చేతిలో లేదు. అన్ని అనుకున్నట్లు జరగవు అందుకే మనం ఎప్పుడు ‘ప్లాన్ బి’ తో రెడీగా ఉండాలి. ప్లాన్ బి అనేది ఒక బ్యాకప్ లాంటింది. ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి రెడీగా పెట్టుకోవడం. ప్లాన్ బి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆందోళనతో పాటు మనమీద ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అనుకున్నది జరగనప్పుడు ప్లాన్ ఏ ఫెయిల్ అయినప్పుడు.. ప్లాన్ బి అమలు చేయలి. ఇలా చేస్తే.. మీరు లైఫ్‌లో పెద్ద పెద్ద రిస్క్‌లు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాకపోతే మనకి సామర్థ్యంతో పాటు కొత్త పరిస్థితులలో సర్దుబాటు అవ్వగలిగే ఆలోచన కావాలి. లేకపోతే ముందుకు
వెళ్ళలేం. మీరు అనుకున్నది రీచ్ అవ్వడం కోసం ఎప్పుడు డిఫరెంట్ యాంగిల్స్.. డిఫరెంట్ సొల్యూషన్స్ వెతికి పెట్టుకోవాలి. అలా అన్ని మార్గాలు మీకు తెలిస్తే మీరు ఎప్పుడు నిరాశ చెందరు.
ఈ ప్లాన్ బి ఎలా ఉండాలంటే.. దాన్ని ఇంకో మార్గంలా మీరు చూడాలి తప్ప.. ప్లాన్ ఏ అవ్వదని నాకు ముందే తెలుసు అనే నెగిటివ్ ఆలోచనలు రాకుడదు. ప్లాన్ బి ఉండటం అనేది ప్రాక్టికల్ మాత్రమే కాదు దాని వలన అందరు సైలెంట్ అవుతారు. ప్లాన్ ఏ గాని ప్లాన్ బి గాని రెండు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఒక్కోసారి మీరు ప్లాన్ బి మీద ఎక్కువ ఫోకస్ పెడితే ప్లాన్ ప్లాన్ ఏ మీద కమిట్మెంట్ తగ్గిపోద్ది. ప్లాన్ బితో వెళ్ళటం ఫెయిల్యూర్ అని ఎప్పుడూ అనుకోవద్దు. ప్లాన్ బి తో ఇంకా ముందుకు వెళ్తున్నాం అనుకోండి. ఒకవేళ ప్లాన్ బి కూడా ఫెయిల్ అయింది.. అప్పుడు ఏం చేస్తాం ప్లాన్ సి కి వెళ్లాల్సి వస్తది. సి ప్లాన్ వేసేది మన డెస్టినేషన్ కోసం. ఇది కాకపోతే ఇంకొకటి. మరో కొత్త రూట్‌ని వెతుక్కోవడమే.
అయితే ఈ ప్లాన్స్ కంటే ఎక్కువ అర్థం చేసుకోవాల్సింది జీవితం ఊహించలేని వంటిది. అనుకున్నది జరగలేదని ఎప్పుడు కుంగిపోవద్దు. రెండు రోజులు లేట్ అవ్వచ్చు అంతే అది ఒక్కటే అర్థం చేసుకొని మనం ముందుకు సాగాలి. అడాప్టివ్ గా ఉంటే ఎలాంటి డిప్రెషన్ లేకుండా ముందుకు పోతాం. మన డెస్టినేషన్ కోసం నడుద్దాం. మన నడకలో స్థిరత్వం ఉండాలి. కాలు విరిగితే కుంటుకుంటూ పోదాం. వర్షం వస్తే తడుచుకుంటూ పోదాం మన ఎమోషన్ డెస్టినేషన్ అవ్వాలి. ఈ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయినా డిప్రెస్ అవ్వద్దు. తలుపులన్నీ మూసుకుపోతే ప్లాన్ కే ఉంది. కే అంటే కిటికీ.. వెతికితే ఎక్కడో కిటికీ దొరుకుద్ది. అది చాలు మనకు దూకేయడానికి. ఒక్కటే గుర్తుంచుకోండి మీ స్థిరత్వం అనేది ప్లాన్ B కంటే శక్తివంతమైనది. అంటూ పూరీ చెప్పుకోచ్చాడు.