Puri Jagannadh | టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫిలాసఫీ పేరిటా పాడ్ కాస్ట్లు చేస్తాడన్న విషయం తెలిసిందే. పూరి మ్యూజింగ్స్(Puri Musings) అనే పేరుతో పూరీ తన భావలతో వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు. ఈ విషయాలను యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. అయితే తాజాగా లిక్టన్స్టైన్ అనే చిన్న దేశం గురించి మాట్లాడారు. ఈ దేశాన్ని ఒకరోజుకి అద్దెకి తీసుకోవచ్చని తెలిపాడు.
నేను ఇప్పుడు చెప్పబోయో దేశం ప్రపంచంలోనే అతి చిన్నది. లిక్టన్స్టైన్ ఈ దేశం పేరు. కేవలం 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ దేశాన్ని కారులో కేవలం 30 నిమిషాల్లో చుట్టేసిరావచ్చు. ఇది ఎన్నో పెద్ద విమానాశ్రయాల కంటే కూడా చిన్నది. స్విట్జర్లాండ్ మరియు ఆస్ట్రియా మధ్య ఉన్న ఈ దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు కుటుంబం ఒక కొండపై నివసిస్తుంది. రోమన్ క్యాథలిక్ సంప్రదాయం కలిగిన ఈ దేశంలో జర్మన్ భాషను మాట్లాడుతారు. ఇక్కడికి చేరుకోవడానికి వాయు లేదా జల మార్గాలు లేవు. జ్యూరిచ్ నుండి రైలు లేదా కారు ద్వారా మాత్రమే వెళ్లగలరు. ఇది అత్యంత సురక్షితమైన దేశాలలో ఒకటి. ఇక్కడ జనాభా 40 వేలకు మించదు మరియు నేరాలు చాలా అరుదుగా జరుగుతాయి. జైలు ఉంది కానీ నేరస్థులు ఉండరు. అందుకే అక్కడి ప్రజలు తమ ఇళ్లకు తాళం కూడా వేయరు. పన్ను రాయితీల కోసం అనేక విదేశీ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను ఏర్పాటు చేస్తాయి.
జాతీయ సెలవులు మరియు పండుగల సమయంలో అక్కడి ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న వారి జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎవరైనా కోరుకుంటే 70 వేల డాలర్లు చెల్లించి ఈ దేశాన్ని ఒక రోజు అద్దెకు తీసుకోవచ్చు. ఆ రోజు వారికి ఎర్ర తివాచీతో స్వాగతం పలుకుతారు మరియు రాజభవనంలో బస ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా, వీధి గుర్తులు వారి పేరుతో ఉంటాయి మరియు వారిని రాజులా గౌరవిస్తారు. వారి ఫోటోతో నకిలీ కరెన్సీని ముద్రిస్తారు మరియు దానితో అక్కడ ఏదైనా కొనుగోలు చేయవచ్చు. పర్యాటకులతో అక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారంటూ పూరీ చెప్పుకోచ్చాడు.