జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టం. విధివైపరీత్యం అంటే ఇదేనేమో అని కొన్ని సంఘటనలు చూస్తే అర్ధమవుతుంది. శుక్రవారం పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసారు. పునీత్ రాజ్‌కుమార్ అనతి కాలంలోనే మంచి నటుడిగా ఎదిగారు. వరుస విజయాలతో కన్నడనాట పవర్‌స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచారు. ఆ గుండెలన్నింటినీ ముక్కలు చేసేలా ఆయన పరమపదించారు.
పునీత్ మృతి ప్రతి ఒక్కరికి పీడకలగా మారింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ముందు రోజు మంచిగా ఉన్న పునీత్ సడెన్‌గా ఇలా చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి సంగీత దర్శకుడు నటుడు గురుకిరణ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న పునీత్ తెల్లారే సరికి విగతజీవిగా మారాడు.
గురు కిరణ్ పుట్టిన రోజు వేడుకలో పునీత్ సరదాగా గడిపిన వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.బర్త్ డే వేడుకలో సుమారు రెండు గంటలకు పైగా ఉన్నారని గురు కిరణ్ చెప్పారు. ఆయన చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని, మాతో చాలా ఉత్సాహంగా గడిపారని వివరించారు. బర్త్ డే పార్టీ వేడుకలో పునీత్ తో పాటు, నటుడు అనిరుధ్ సహా అనేక మంది శాండల్ వుడ్ నటీనటులు పాల్గొన్నారు. అయితే పునీత్ ఇలా హఠాన్మరణం చెందడం గురు కిరణ్‌ని బాధకు గురి చేసింది. దేవుడు నిన్ను తన దగ్గరకు తీసుకున్నారు.. మేము నిన్ను కోల్పోయాము.. జీవితం అనూహ్యమైంది అంటూ ఆయన కామెంట్ చేశారు.
https://www.instagram.com/reel/CVnq95ZN2jw/?utm_source=ig_web_copy_link