సిజు విల్సన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఓ మలయాళ చిత్రం ‘పులి’ పేరుతో తెలుగు తెరపైకి రాబోతున్నది. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సీహెచ్ సుధాకర్ బాబు విడుదల చేస్తున్నారు. యాక్షన్ పీరియాడిక్ డ్రామా కథతో దర్శకుడు వినయన్ ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో జరిగింది. నిర్మాత సీహెచ్ సుధాకర్ బాబు మాట్లాడుతూ…‘సమాజంలోని అసమానతలపై పోరాడిన ఓ వీరుడి కథ ఇది. అనంత పద్మనాభ స్వామి ఆభరణాల చరిత్ర కూడా కథలో ఉంటుంది’ అన్నారు. దర్శకుడు వినయన్ మాట్లాడుతూ..‘కేరళ చరిత్రలో దాగి ఉన్న ఓ కథ ఇది. దీన్ని ప్రజలకు చెప్పాలనే తెరపైకి తీసుకొచ్చాం. సమాజంలో జరిగిన ఒక దారుణానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడి కథను ఆసక్తికరంగా చూపించాం’ అన్నారు.