ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హైవే’. కేవీ గుహన్ దర్శకుడు. వెంకట్ తలారి నిర్మాత. బుధవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ మేరకు చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే సైకో థ్రిల్లర్ చిత్రమిది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం థ్రిల్‌ను పంచుతుంది. ఆనంద్ దేవరకొండ పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషించనున్నారు. వారెవరన్నది త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని కేవీ గుహన్ అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కేవీ గుహన్.