Psych Siddhartha | టాలీవుడ్ యువ నటుడు నందు, యామిని భాస్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. మీలాంటి యువకుడి కథ అనేది ఉపశీర్షిక. అడల్ట్ కామెడీతో తెరకెక్కుతున్న ఈ మూవీకి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు నందు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం మొదట ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అదే రోజున బాలకృష్ణ అఖండ 2 విడుదల కాబోతుంది. దీంతో బాలయ్యకు తమ మద్దతు ఉంటుందని చిత్రబృందం తెలుపుతూ.. ఒక వీడియోను విడుదల చేసింది. అలాగే ఈ సినిమాను జనవరి 1న విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది.
With due respect to the legend #NBK garu and the massive #Akhanda2,#PsychSiddhartha is shifting its release to January 1st., 2026.
Wishing the entire team all the very best for their grand release on December 12th! ❤️ #ShreeNandu @RanaDaggubati #yaamini #priyanka #varunreddy… pic.twitter.com/6oIvOPeKbw
— Ramesh Bala (@rameshlaus) December 10, 2025