మత్తువదలరా ఫేం రితేష్‌రానా దర్శకత్వంలో వస్తున్న చిత్రం హ్యాపీ బర్త్ డే (Happy Birthday). లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) లీడ్ రోల్లో నటిస్తున్న ఈ ప్రాజెక్టులో సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ (Vennela Kishore) కీ రోల్స్ చేస్తున్నారు. జూలై 15న గ్రాండ్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సరికొత్తగా ప్రమోషన్స్ మొదలుపెట్టింది.
హ్యాపీ బర్త్ డే టీం ఇటీవలే ఫేక్ టీవీ ఛానల్ డిబేట్ తో చేసిన ప్రమోషన్స్ కు మంచి స్పందన వస్తోంది. కాగా ఇపుడు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది టీం. మీ నెక్ట్స్ సినిమాకు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో 200కోట్లు కలెక్షన్లు రావాలని కోరుకుంటూ..హ్యాపీ బర్త్ డే అన్నా..టామ్‌క్రూయిజ్ ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ అంటూ ట్వీట్ చేసింది టీం. టామ్ క్రూయిజ్‌ను అన్నా అని సంబోధిస్తూ సినిమా యాక్టర్లంతా బ్యానర్‌పై తమ ఫొటోలుపెట్టి..విష్ చేస్తున్న స్టిల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ , మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie makers) సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెరీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ సారంగం సినిమాటోగ్రఫర్.
Happy Birthday @TomCruise 🥳#HBDTomCruiseAnna
Idokkate Birthday wish chesey poster.. Migitha anni maa Cinema #HappyBirthday Poster lu ayya 😋😀#HBDMovie #HBDMovieOnJuly8 pic.twitter.com/P2rVhQIhmP
— Clap Entertainment (@ClapEntrtmnt) July 3, 2022