శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డాక్టర్ సాబ్’. డి.ఎస్.బి దర్శకుడు. ఎస్.పి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను నిర్మాత సురేష్ కొండేటి ఇటీవల విడుదలచేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘వైద్యుల గొప్పతనాన్ని ఆవిష్కరించే చిత్రమిది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిస్తున్నాం. వృత్తినిర్వహణలో వైద్యులకు ఎదురయ్యే కష్టనష్టాలను ఆవిష్కరిస్తూ సందేశాత్మకంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి సీనియర్ ఫైట్ మాస్టర్ విక్కీ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. డాక్టర్‌గా తన పాత్ర విభిన్నంగా ఉంటుందని హీరో శోభన్ అన్నారు.