జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. శ్రావణిశెట్టి కథానాయిక. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని నిర్మాత రాజ్ కందుకూరి లాంచ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ధర్మవిరుద్ధంగా బతుకుతూ సమాజ క్షామానికి కారకులైన వారికి గరుడపురాణం ప్రకారం యముడు శిక్షిస్తుంటాడు. అసలు యముడు ఎందుకు అలా చేస్తాడు? అనే ప్రశ్నకు సమధానమే ఈ సినిమా అని దర్శక, నిర్మాత, హీరో జగదీష్ ఆమంచి చెప్పారు. ఆకాష్ చల్లా రెండో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన: హరి అల్లసాని, జగదీష్ ఆమంచి, కెమెరా: విష్ణురెడ్డి వంగా, సంగీతం: భవాని రాకేష్.