‘మంగళవారం’ మాకు బాగా నచ్చిన కథ. నిజానికి ఈ సినిమాను దర్శకుడు అజయ్‌భూపతి తన సొంత బ్యానర్లో చేయాలనుకున్నారు. ఈ కథ విన్నప్పుడు ప్రొడ్యూస్ చేయడానికి నాకీ కథ కరెక్ట్ అనిపించింది. అజయ్ కూడా కాదనలేదు. అంతా డెస్టినీ’ అన్నారు నిర్మాత గునుపాటి స్వాతిరెడ్డి. ‘ఆర్ఎక్స్ 100’ఫేం అజయ్‌భూపతి దర్శకత్వంలో ఎం.సురేశ్వర్మతో కలిసి ఆమె నిర్మించిన చిత్రం ‘మంగళవారం’. పాయల్‌రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలు స్వాతిరెడ్డి, సురేశ్‌వర్మ విలేకరులతో ముచ్చటించారు.
బన్నీ వల్లే ఇది సాథ్యమైంది
నిర్మాతను కావడం నా కల. ఆ విషయం బన్నీకి ఎలా తెలిసిందో ఏమో ‘ఎందుకు కలగా వదిలేయాలి? ట్రై చెయ్.. తొలి ప్రయత్నం కాబట్టి నీతో ఎవరైనా పార్ట్నర్ ఉంటే బావుంటుంది’ అన్నాడు. సురేశ్వర్మగారికి కూడా సేమ్ డ్రీమ్. అలా ఇద్దరం కలిసి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. అల్లు అర్జున్, నేనూ చాలాకాలంగా స్నేహితులం. మా మధ్య మంచి బాండింగ్ ఉంది.
అన్ని రకాల ఎమోషన్సూ ఉంటాయి
తొలి సినిమా కాబట్టి చిన్నవాళ్లతో వెళ్లడమే కరెక్ట్ అని ఈ సినిమా చేశాం. మా మంగళవారంకు కథే హీరో. ఈ కథలో వినోదంతోపాటు సందేశంకూడా ఉంది. డార్క్ థ్రిల్లర్ అయినప్పటికీ ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. రెగ్యులర్ సినిమా కాకుండా, ఓ విభిన్నమైన సినిమా ద్వారా నిర్మాతలం అవుతున్నందుకు ఆనందంగా ఉంది.
కథలో ఆ మాస్క్ కీలకం
పోస్టర్స్ చూసి అందరూ ‘కాంతారా’ ఇన్స్పిరేషన్ అంటున్నారు. నిజానికి ఈ కథను అజయ్ ‘కాంతారా’ కంటే ముందే నాకు చెప్పాడు. ఈ కథలో మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో స్కెచ్‌లు వేయించి చివరకు ఈ మాస్క్ ఓకే చేశాం. కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా అన్ని బాధ్యతలూ భుజాలపై మోశాడు అజయ్. మాకు వత్తిడి లేకుండా చేశాడు. తొలి సినిమాకే మంచి దర్శకుడు, మంచి టీమ్ దొరకడం మా అదృష్టం. పాయల్ రాజ్‌పుత్ కేరక్టర్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. చాలామంది కొత్తవాళ్లను ఆడిషన్స్ చేసి తీసుకోవడం జరిగింది. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇది. సాంకేతికంగా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.