Producer Bunny Vasu | ప్రముఖ నిర్మాత బన్నీ వాసుకు అరుదైన అవకాశం లభించింది. ఆయనకు జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మార్చి 14, 2025న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగనుండగా.. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లలో ఆయన ప్రముఖ పాత్ర పోషించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనను పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్ఛార్జ్గా నియమించినట్లు సమాచారం. ఈ సభకు సంబంధించిన నిర్వహణ మొత్తం బన్నీ వాసు నేతృత్వంలో జరగనుందని తెలుస్తోంది. ఈ కీలక నియామకంతో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను గ్రాండ్గా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. బన్నీ వాసు సినిమా నిర్మాణంలోని తన నైపుణ్యాన్ని, సంస్థాగత నైపుణ్యాలను ఈ ఈవెంట్ విజయవంతానికి ఉపయోగించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.