కన్నడ నటుడు కోమల్ కుమార్, రిషీక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘యమధీర’. శంకర్.ఆర్ దర్శకుడు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ పతాకంపై వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను నిర్మాత, నటుడు అశోక్ కుమార్ ఆవిష్కరించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘అజర్ బైజాన్, శ్రీలంక వంటి దేశాల్లో చిత్రీకరణ జరిపాం. క్రికెటర్ శ్రీశాంత్ ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తారు. యాక్షన్ హంగులతో ఆకట్టుకునే చిత్రమిది’ అన్నారు. త్వరలో థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత వేదాల శ్రీనివాస్ తెలిపారు. నాగబాబు, అలీ, సత్యప్రకాష్, మధుసూదన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రోష్ మోహన్ కార్తీక్, సంగీతం: వరుణ్ ఉన్ని, కథ, దర్శకత్వం: శంకర్ ఆర్.