ఈ ఏడాది తెలుగులో ‘ఓజీ’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకుంది కన్నడ భామ ప్రియాంక మోహన్. ప్రస్తుతం ఆమె దక్షిణాదిన భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. తాజాగా ఈ సొగసరి కన్నడ చిత్రం ‘666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’లో భాగమైంది. ధనంజయ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి హేమంత్ ఎం రావు దర్శకుడు. శివరాజ్‌కుమార్ కీలక పాత్రధారి. శనివారం ఈ సినిమా నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
ఇందులో ఆమె వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నది. టైమ్‌ట్రావెల్ కథాంశమిదని, ప్రేక్షకుల్ని సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, ప్రియాంక మోహన్ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయని, తెలుగు, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత వైశాక్ జె గౌడ తెలిపారు. ఈ చిత్రానికి చరణ్‌రాజ్ స్వరకర్త.