బిగ్ బాస్ హౌజ్‌లో కొందరు శత్రువులు, మరి కొందరు మిత్రులుగా మారారు. జెస్సీ బ్యాచ్.. రవిని బాగా టార్గెట్ చేశారు. షణ్ముఖ్‌తో మాట్లాడుతూ.. గేమ్ లో ఎత్తుకి పైఎత్తు వేసి గెలవాలే తప్ప ఒకరిని తొక్కేద్దాం, నాశనం చేద్దాం, అని అనుకుంటే అంతకంటే లేఖీ గాళ్లు ఎవరూ ఉండరు. ఇలాంటోడు గేమ్‌లోనే ఇలా ఆలోచిస్తున్నాడంటే.. రియల్ లైఫ్‌లో ఎంతలా ఉంటాడో ఆలోచించు అని అన్నాడు జస్వంత్.
నా గేమ్ నాకు తెలుసు.. వేషాలు వేయాల్సిన అవసరం లేదని చెప్పా.. అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. రవి, లోబో, సన్నీ, మానస్, శ్రీరామ్ వీళ్లంతా ఓ గ్రూప్.. ఇక మనిద్దరమే మిగిలాం అని షణ్ముఖ్‌తో చెప్పాడు జెస్సీ. ఇక కెప్టెన్ ఫుల్ శ్రీరామ్ కన్ఫ్యూజన్లో ఉన్నాడంటూ తన గ్యాంగ్‌తో కూర్చున్నప్పుడు శ్రీరామ్ మీద జోకులు పేల్చింది.
కిచెన్ లో హమీదా.. ప్రియాంకల మధ్య మటన్ విషయంపై గొడవ రేగింది. ప్రియాంక మటన్ కర్రీ వండి.. అందరికీ నేను వడ్డిస్తా అని చెప్పింది.. అయితే హమీదా వచ్చి మొత్తం ఎన్ని పీస్‌లు ఉన్నాయో లెక్కపెట్టు అని అన్నది. పీస్‌లు ఎలా లెక్కపెడతాం అని ప్రియాంక చెప్పగా, తాను లెక్కపెట్టి చూపించింది హమీదా.
కర్రీ పీస్‌లు కౌంట్ చేయడం ఏంటి.. మటన్ కొట్టినోడు ఏమైనా నా మొగుడా.. పదేళ్లగా వంట చేస్తున్నా నాకు తెలియదా ఎలా చేయాలో.. పక్కన కూర్చుని టీచింగ్ చేస్తున్నారు.. ఇన్నాళ్లూ తిన్నది ఏంటి, గడ్డి తిన్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రియాంక. శ్రీరామ్ కెప్టెన్ అయ్యాక హమీదా..హౌజ్ మొత్తం నాదే అన్నట్టు వ్యవహరిస్తుందని ముచ్చటించుకున్నారు.