Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన 43వ పుట్టినరోజును బీచ్ గెట్అవేలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తన భర్త నిక్ జోనాస్, ముద్దుల కూతురు మాల్తీ మేరీతో కలిసి ఆమె ఈ ప్రత్యేకమైన రోజును ఆనందంగా గడిపారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని అందమైన క్షణాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా.. బర్త్డే రోజు నిక్ని ముద్దులతో ముంచెత్తింది ప్రియాంక. మరోవైపు నిక్ జోనాస్, మాల్తీ మేరీతో కలిసి బీచ్లో సరదాగా గడుపుతున్న ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం పలు అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబుతో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రాబోయే ‘SSMB29’ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన కుటుంబానికి సమయం కేటాయించడంలో ప్రియాంక ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారు.