హైదరాబాద్, ఫిబ్రవరి 10: టెక్నాలజీ ఆధారిత మౌలిక సదుపాయాల కన్సల్టెన్సీ సంస్థ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్..ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో)కి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీవో కింద రూ.202 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనున్నది. ఈ షేర్లను కంపెనీ ప్రమోటర్లు వెంకటాచల చక్రపాణి రెడ్ల ఆఫర్ ఫర్ సేల్ విధానంలో 67.5 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ ఐపీవో ద్వారా సేకరించనున్న రూ.202 కోట్ల నిధుల్లో రూ.76 కోట్ల నిధులను రుణాలను చెల్లించడానికి, మరో రూ.22 కోట్లను జియోస్పేషియల్ సొల్యూషన్స్ అండ్ డిజిటల్ ఇంజినీరింగ్ టెక్నాలజీని మరింత బలోపేతం చేయడానికి వినియోగించనున్నది.