Priyanka Chopra | బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతుంది. హాలీవుడ్‌కి వెళ్ళాక అక్కడ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. 2018లో ఆమె అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రియాంక..నిక్ కన్నా 10 సంవత్సరాలు పెద్దది కావడంతో వారి పెళ్లి గురించి ప్రారంభంలో చాలా మంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. అమెరికా గ్రీన్ కార్డ్ కోసం అని కొందరు, మరికొందరు డబ్బుకోసం అని పలు విమర్శలు చేశారు
అయితే వాటన్నింటికీ నిక్ – ప్రియాంకలు తమ బంధంతో బదులు చెప్పారు. నిక్ జోనస్ తరచూ ప్రియాంకతో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు. తాజాగా నిక్ బీచ్‌లో ప్రియాంకతో కలిసి తీసుకున్న ఓ వీడియోను షేర్ చేశాడు. ‘‘ఆమె లేకుండా..’’ అని ఎమోజీతో పేర్కొనగా, అంతలోనే ప్రియాంక పరిగెత్తుకుంటూ వచ్చి, అతడిని హత్తుకుని లిప్‌లాక్ చేసే క్షణాన్ని వీడియోలో చూపించాడు. ఆ వీడియోకు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.
నిక్ షేర్ చేసే ప్రతి ఫోటోకు లక్షల మంది లైక్స్, కామెంట్లు వస్తుంటే, ఈ వీడియోకు అయితే అంతకన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ప్రియాంక ఈ వీడియోను తన అకౌంట్లో షేర్ చేయకపోయినా, ఆమె బీచ్ ఫోటోలు మాత్రం పోస్టు చేసింది. ఇక తమ వివాహ జీవితం గురించి వస్తున్న పుకార్లను నిజం కాదని నిరూపిస్తూ, నిక్–ప్రియాంకలు ఏడేళ్ల వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు వీరి గురించి ఒక్కటైన నెగెటివ్ వార్త కూడా బయటకు రాలేదు. మరోవైపు ప్రియాంక సినీ కెరీర్ కూడా దూసుకుపోతుంది. హాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఇండియన్ సినిమాల్లోకి తిరిగి అడుగుపెట్టింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న మల్టీ-లాంగ్వేజ్ అడ్వెంచర్ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ప్రియాంక ఎంపిక అయ్యారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్కు ఆమె హాజరయ్యారు. బాలీవుడ్‌లోనూ ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో నటించేందుకు సైన్ చేసినట్లు సమాచారం.