బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్ ముంబైలోని ఆంధేరి వెస్ట్‌లో ఉన్న తన నాలుగు లగ్జరీ ఫ్లాట్లను రూ. 16.17 కోట్లకు అమ్మేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇక ప్రియాంక అమ్మిన అపార్ట్మెంట్లు లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లో ఉండగా.. ఇందులో మూడు ఫ్లాట్లు 18వ అంతస్తులో, ఒకటి 19వ అంతస్తులో ఉన్నట్లు సమాచారం. ఇక ప్రియంకా చోప్రా మార్చి 03న ఈ ప్లాట్లను అమ్మినట్లు ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా అనే సంస్థ వెల్లడించింది. ముంబైలోని సంపన్నుల కుటుంబం అయిన సచ్దేవ కుటుంబ సభ్యులు ఈ ఫ్లాట్లను కోనుగోలుచేసినట్లు తెలుస్తుంది.
18వ అంతస్తులో ఉన్న మొదటి మూడు ఫ్లాట్లను వరుసగా.. రూ. 3.45 కోట్లు, రూ. 2.85 కోట్లు, రూ. 3.52 కోట్లకు అమ్మిన ప్రియాంక 19వ అంతస్తులో ఫ్లాట్‌ని రూ.6.35 కోట్లకు అమ్మింది. ఇక ఈ నాలుగు ప్లాట్లకు సంబంధించి స్టాంప్ డ్యూటీ మొత్తం రూ. 83 లక్షలు చెల్లించినట్లు సమాచారం.
బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ప్రియాంక అనంతరం హాలీవుడ్‌కి షిప్ట్ అయ్యింది. అయితే హాలీవుడ్ సింగర్ అయిన్ నిక్ జోనస్‌ని 2018లో వివాహం చేసుకున్న అనంతరం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోనే సెటిల్ అయ్యింది ప్రియాంక. అయితే తాను అమెరికాలో ఉన్న కూడా ఇండియాలో తన బిజినెస్‌ను అప్పుడప్పుడు చూసుకోవడానికి వస్తూ ఉంటుంది. 2023లో కూడా ప్రియాంక ఆంధేరిలో ఉన్న తన రెండు పెంట్ హౌజ్‌లతో పాటు ఒక కమర్షియల్ ప్రాపర్టీని రూ. 13 కోట్లకు అమ్మివేసింది.
సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ భామ తెలుగు చిత్రంలో నటిస్తుంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఒడిషాలో జరుపుకుంటుంది.