Priyanka Chopra | ‘క్రిష్ 4’.. రూ.30 కోట్లు డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
Hritik Roshan | బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ మెగాఫోన్ పడుతున్న విషయం తెలిసిందే.
Hritik Roshan | బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ మెగాఫోన్ పడుతున్న విషయం తెలిసిందే. తాను హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ క్రిష్ ఫ్రాంచైజీలో భాగంగా నాలుగో పార్ట్‌కు హృతిక్ రోషన్ దర్శకత్వం వహించబోతున్నాడు. 20 ఏళ్ల క్రితం ‘కోయీ మిల్ గయా’తో మొదలైన ఈ సిరీస్, ఆ తర్వాత ‘క్రిష్ 2’, ‘క్రిష్ 3’లతో బ్లాక్ బస్టర్లు అందుకుంది. ఈ సినిమాల్లో హృతిక్‌తో పాటు అందాల తార ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్‌గా నటించగా, కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు.
అయితే తాజాగా రాబోతున్న ‘క్రిష్ 4’లో ప్రియాంక చోప్రా మరోసారి లీడ్ రోల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. హృతిక్ రోషన్ ఈ మూవీ కథను ప్రియాంకకు వినిపించగా.. ఆమెను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రియా పాత్రలో ఆమె మెరవనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ప్రియాంక చోప్రా టీమ్ నుంచి ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలావుంటే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. క్రిష్ 4కి ఏకంగా రూ.20 నుంచి 30 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ‘SSMB29’ సినిమాకు కూడా ప్రియాంక దాదాపు రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకోనున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

