Priyanka Arul Mohan | హీరోయిన్ ప్రియాంక మోహన్ సూపర్ ఫామ్ లో వుంది. ఆమెకు వరుసగా పెద్ద సినిమాల అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా చేస్తోంది ప్రియంక. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దళపతి విజయ్, వెంకట్ ప్రభు సినిమాకి సైన్ చేస్తింది. ఇప్పుడు ఆమెకు మరో క్రేజీ అవకాశం వచ్చింది.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం దసరాకి ప్రారంభం కానుంది. అందులో నాని సరసన ప్రియాంక మోహన్ ని కథానాయికగా ఎంపిక చేస్తారని సమాచారం. ప్రియాంక, నాని ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయింది. తర్వాత ‘డాక్టర్’ సినిమా విజయంతో మంచి క్రేజ్ ని సమపాయించుకుని టాప్ స్టార్స్ తో కలిసినటించే అవకాశాలు అందుకుంది. ఇప్పుడు ఈ జోడి మరోసారి సందడి చేయనుంది. ప్రస్తుతం నాని నటిస్తున్న హాయ్ నాన్న చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది.
Welcome aboard, @priyankaamohan! ❤️
Can’t wait to see you on the set soon! 🤗#Nani31
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/BYly81zZ3g
— DVV Entertainment (@DVVMovies) October 21, 2023