Priyanka Arul Mohan | న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్‌లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది కోలీవుడ్ భామ ప్రియాంక ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan). తొలి సినిమాతోనే తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నానితో కలిసి శ్రీకారంలో నటించింది. ఈ బ్యూటీ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దీంతోపాటు ధనుష్ కాంపౌండ్ నుంచి వస్తున్న కెప్టెన్ మిల్లర్‌లో కీలక పాత్రలో నటిస్తోంది.
నెట్టింట సూపర్ క్రేజ్ ఉన్న ఈ భామ తమిళనాడులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ సెలబ్రేషన్ ఈవెంట్లో పాల్గొన్నది. టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య (SJ Suryah) కూడా ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ధనుష్ ఫేవరెట్ ట్రాక్‌కు సింపుల్‌గా డ్యాన్స్ చేసి.. అందరినీ ఇంప్రెస్ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ప్రియాంకా మోహన్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ బ్యూటీ ప్రస్తుతం నానితో రెండో ప్రాజెక్ట్ సరిపోదా శనివారం సినిమాలో నటిస్తోండగా.. షూటింగ్ దశలో ఉంది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో షురూ అయింది.నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. షూటింగ్ లొకేషన్ లో తీసిన స్టిల్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.
యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై క్యూరియాసిటీ అంచనాలు భారీగానే ఉన్నాయి.
ట్రెండింగ్‌లో డ్యాన్స్ వీడియో..
Precious Doll 😍❣️@priyankaamohan #PriyankaMohan#PriyankaArulMohanpic.twitter.com/Fi0QtS1BJG pic.twitter.com/E5C8UuGy0M
— Kutty Chovan (@KuttyChovan) January 2, 2024
ప్రియాంకా మోహన్ స్టిల్స్..
Stunning Clicks #PriyankaMohan@priyankaamohan #KollywoodCinima pic.twitter.com/0kckkm0WbH
— Kollywood Cinima (@KollywoodCinima) July 30, 2023
బ్యాక్ ఇన్ యాక్షన్..
Back in action! 😎#SaripodhaaSanivaaram shoot resumes today with a pivotal moments between Natural 🌟 @NameIsNani and @priyankaamohan ❤️🔥@iam_SJSuryah #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @IamKalyanDasari @DVVMovies pic.twitter.com/YKehyHYzF6
— DVV Entertainment (@DVVMovies) December 27, 2023
ప్రియాంకా మోహన్ లుక్..
Wishing the beautiful @priyankaamohan a very Happy Birthday!!
See you on the sets very soon ❤️💛#TheyCallHimOG #SaripodhaaSanivaaram pic.twitter.com/o2VmWlCwRb
— DVV Entertainment (@DVVMovies) November 20, 2023
Team #SaripodhaaSanivaaram all smiles at the Pooja ceremony! ❤️
With positivity in abundance, we’re set to embark on a memorable journey 🤗🎬 Clap by #VVVinayak garu
🎥 Switched on by #DilRaju garu
🎬 First shot direction by @Iam_SJSuryah garuThe shoot kicks off in November… pic.twitter.com/CN2hx0Or1P
— DVV Entertainment (@DVVMovies) October 24, 2023
Delighted to have the majestic @iam_SJSuryah on board and he’s ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGq
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023