Priyanka Arul Mohan | నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది తమిళ భామ ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan). ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత శర్వానంద్‌తో శ్రీకారం సినిమాలో మెరిసింది. ఈ భామ కన్నడతోపాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. టాప్ బ్యానర్లలో సినిమాలు చేస్తున్న ఈ భామకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.
ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్తో నెటిజన్లను పలుకరించే ఈ భామ తాజాగా సరికొత్త లుక్‌లో మెరుస్తూ.. నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రంగురంగుల సీతాకోక చిలుకలా మిలమిల మెరిసిపోతూ.. మెరుపులా మెరిసే సిరివెన్నెలవో.. మరి వెన్నెల పూల పందిరితో పాటను గుర్తు చేస్తోంది. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ భామ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తోన్న (OG)లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సాహో ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఓజీ నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెలలో షురూ కానుంది. ఈ షూట్లో పవన్ కల్యాణ్ జాయిన్ కాబోతున్నాడని ఇన్సైడ్ టాక్.
ప్రియాంకా అరుళ్ మోహన్ మరోవైపు ధనుష్ నటిస్తోన్న కెప్టెన్ మిల్లర్‌లో కూడా కీ రోల్ చేస్తోంది. ఇప్పటికే ఓజీలోని పలు సన్నివేశాలను ముంబై, పూణే, హైదరాబాద్ షెడ్యూల్స్‌లో కంప్లీట్ చేశారు. ఈ మూవీకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. ఇప్పటికే ఓజీ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
Stunning Clicks #PriyankaMohan@priyankaamohan #KollywoodCinima pic.twitter.com/0kckkm0WbH
— Kollywood Cinima (@KollywoodCinima) July 30, 2023