ఆ సినిమానే నన్ను మార్చింది
ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ అభినందనీయంగా ఉంది. ఆమె బాలీవుడ్లో నటించిన ‘ఆర్టికల్ 370’ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. ఏప్రిల్ 10న అజయ్‌దేవగణ్‌తో ఆమె నటించిన ‘మైదాన్' కూడా విడుదల కానుంది.
ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ అభినందనీయంగా ఉంది. ఆమె బాలీవుడ్లో నటించిన ‘ఆర్టికల్ 370’ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. ఏప్రిల్ 10న అజయ్‌దేవగణ్‌తో ఆమె నటించిన ‘మైదాన్’ కూడా విడుదల కానుంది. ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా అమిత్‌శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో ఆసక్తికరంగా మాట్లాడింది ప్రియమణి. ‘కెరీర్ తొలినాళ్లలో ఏది తప్పో ఏది ఒప్పో తెలిసేది కాదు. వచ్చిన ప్రతి పాత్రకూ ఒప్పుకునేదాన్ని. ‘పరుత్తివీరన్’ నటిగా నా దృక్పధాన్ని మార్చింది. ఆ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నాను. అప్పట్నుంచి స్వీయవిమర్శను అలవరచుకున్నాను. కొత్తగా చేయాలనే తపన మొదలైంది. కథలు ఎంచుకునే తీరు మారింది. ఇప్పుడు నా వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నాను. నటిగా నా బాధ్యత మరింత పెరిగినట్టుగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి. అజయ్‌దేవగణ్‌తో కలిసి ‘మైదాన్’లో నటించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేసింది. అజయ్దేవగణ్ను ఓ అద్భుతంగా ఆమె అభివర్ణించింది. కళ్లతోనే అన్ని భావాలూ పలికించగల అద్భుతమైన నటుడు అజయ్‌దేవగణ్ అనీ, రేపు ‘మైదాన్’లో ఆయన్ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని తెలిపింది
ప్రియమణి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

