శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 24, 2021 , 09:37:54

క‌థ డిమాండ్ చేస్తే గ్లామ‌ర్ షోకు రెడీ అంటున్న ప్రియ‌మ‌ణి

క‌థ డిమాండ్ చేస్తే గ్లామ‌ర్ షోకు రెడీ అంటున్న ప్రియ‌మ‌ణి

ముస్త‌ఫా రాజ్‌ని వివాహం చేసుకోక‌ముందు  తెలుగు,  తమిళ, కన్నడ భాషల్లో వైవిధ్య‌మైన సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని మెప్పించిన న‌టి ప్రియ‌మ‌ణి. ప్ర‌స్తుతం  'విరాటపర్వం' సినిమాలో భారతక్క పాత్ర చేస్తున్న  ప్రియ‌మ‌ణి  వెంకటేష్ సరసన 'నారప్ప' సినిమాలో డిఫరెంట్ రోల్ పోషిస్తోంది. త‌మిళ‌నాట జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న త‌లైవి చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమాలో ప్రియ‌మ‌ణి పాత్ర స‌రికొత్తగా ఉంటుంద‌ని అంటున్నారు

త‌లైవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టాల‌ని భావించిన ప్రియ‌మ‌ణి  క‌థ డిమాండ్ చేస్తే అందాల ఆర‌బోత‌కు సిద్దంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది. అంతేకాదు కొన్ని గ్లామ‌ర్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేసి హీటెక్కిస్తుంది. ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి గ్లామ‌ర్ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. ఇప్పుడు ప్రియ‌మ‌ణి చేతిలో అర‌డ‌జ‌నకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయ‌ని స‌మాచారం.  

VIDEOS

logo