Sarangapani Jathakam | టాలీవుడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, బలగం నటుడు ప్రియదర్శి కాంబోలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘సారంగపాణి జాతకం’ అంటూ ఈ సినిమా రాబోతుండగా.. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మన్, ‘సమ్మోహనం, చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ఆకట్టుకుంది. అయితే దసరా కానుకగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో రూప కొడువాయూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వి.కె. నరేష్. తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూపలక్ష్మి, హర్షిణి , కె.యల్.కె. మణి కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Priyadarshi’s SarangapaniJathakam coming to theatres on Friday, 20th December. pic.twitter.com/yQnUWd93Mq
— Aakashavaani (@TheAakashavaani) October 12, 2024