ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’. ‘Thrill – U – Prapthirasthu’ ఉపశీర్షిక. సుమ కనకాల కీలక పాత్రధారి. నవనీత్ శ్రీరామ్ దర్శకుడు. పుస్కూర్ రామ్మోహన్రావు, జాన్వీ నారంగ్ నిర్మాతలు. రానా దగ్గుబాటి సమర్పకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. అ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ ‘మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్.
అందరూ సినిమాను అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. ఈ క్లీన్ ఎంటర్టైనర్ని చూడనివారుంటే చూసేయండి’ అని కోరారు. యూత్ మాత్రమే కాక, ఫ్యామిలీ ఆడియన్స్కు కూడా సినిమా బాగా నచ్చిందని, డైరెక్టర్ కావాలనుకునే తన కల ఈ సినిమాతో నెరవేరినందుకు ఆనందంగా ఉందని నవనీత్ శ్రీరామ్ అన్నారు. ఇంకా కథానాయిక ఆనంది, నిర్మాత జాన్వీ నారంగ్ కూడా సంతోషం వెలిబుచ్చారు.