Priya Bhavani Shankar | ‘కల్యాణం కమనీయం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయింది చెన్నై చందమామ ప్రియా భవానీశంకర్. ప్రస్తుతం కోలీవుడ్లో ప్రియా భవానీశంకర్ బిజీబిజీ. తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘బ్లాక్’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది ప్రియా భవానీశంకర్.
‘కెరీర్ పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్కిన్షోకు మాత్రం ఓకే చెప్పను. నా శరీరం వస్తువు కాదు. ఒక వస్తువుగా నా శరీరాన్ని చూపించాలనుకోవడంలేదు. సినిమాల్లో రాణించాలంటే అందంగా కనిపిస్తే చాలు. స్కిన్షో అవసరం లేదు. నా అభిప్రాయం నచ్చకే టాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లు క్యాన్సిల్ అయ్యాయి. అయినా సరే.. ఆత్మాభిమానాన్ని చంపుకొని స్కిన్షో చేయను. హీరోయిన్గా మాత్రమే కనిపించాలని రూలేమీ పెట్టుకోలేదు. నెగెటివ్ కేరక్టర్లు చేయడానికి కూడా రెడీ. స్కిన్ షో మాత్రం చేయను.’ అంటూ కరాఖండీగా చెప్పేసింది ప్రియా భవానీశంకర్.