Actor Srikanth – Srikalahasti | ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది. సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబానికి ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై ఆలయ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఈ నెల 29న శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ఈ పూజలను ముక్కంటి ఆలయంలో పనిచేస్తున్న కొందరు అర్చకులు, వేద పండితులు నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆలయ ఆచార వ్యవహారాలకు, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పూజలు నిర్వహించడంపై ఆలయ అధికారులు సీరియస్గా స్పందించి, సంబంధిత వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.