మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు సినిమాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ‘సలార్’ చిత్రంలో ఆయన కీలక పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం మహేష్‌బాబు ‘వారణాసి’లో విలన్‌గా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం పృథ్వీరాజ్ మరో తెలుగు సినిమాలో భాగం కాబోతున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే..నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నది.
కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ కీలక పాత్రను పోషించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.