Vilaayath Budha | తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మాలీవుడ్ స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తోన్న మలయాళ థ్రిల్లర్ ప్రాజెక్ట్ విలాయత్ బుధ. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఫొటో రూపంలో నెట్టింట రౌండప్ చేస్తోంది.
ఈ చిత్రానికి జేక్స్‌బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రేజీ కంపోజర్ ట్రెండ్ సెట్టింట్ సాంగ్‌ను రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం విలాయత్ బుధ ప్రోమో సాంగ్ షూటింగ్‌ను కోచిలో షూట్ చేస్తున్నారు. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుందని తెలియజేశారు మేకర్స్.
తెలుగుతోపాటు పాన్ ఇండియా భాషల్లో విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. టీజర్లో నువ్వేమైనా పుష్ప అనుకుంటున్నవా రా.. అని పోలీసాఫీసర్ అంటుంటే.. నో తను ఇంటర్నేషనల్.. మనం లోకల్ అని అంటున్నాడు పృథ్విరాజ్ సుకుమారన్.
2020లో మలయాళం రైటర్ జీఆర్ ఇందుగోపన్ విలాయత్ బుద్ధ అనే (మలయాళం) నవలను లాంచ్ చేయగా.. ఈ నవల ఆధారంగా విలాయత్ బుద్ధ తెరకెక్కుతోంది. ఈ నవలకు సూపర్ క్రేజ్ రావడంతో పెద్ద సంఖ్యలో అమ్ముడైంది.
ఓ స్కూల్ టీచర్ తన ఇంటి ప్రాంగణంలో అరుదైన గంధపు చెట్లను రహస్యంగా పెంచుతుంటాడు. అయితే ఓ స్మగ్లర్ కన్ను స్కూల్ టీచర్ పెంచుతున్న గంధపు చెట్లపై పడుతుంది. అయితే ఆ స్మగ్లర్ సదరు స్కూల్ టీచర్ దగ్గర చదువుకున్న మాజీ విద్యార్థి కావడం కథలో ట్విస్ట్. ఇద్దరి మధ్య ఘర్షణ కాస్తా ఊరికి.. అక్కడి నుండి మాఫియా కనెక్ట్ అయే క్రమంలో ఎలాంటి పరిణాలు చోటుచేసుకున్నాయనేది స్టోరీ సాగుతుంది.
#JakesBejoy is creating another trendsetter song 🔥#VilaayathBudha promo song shoot happened in Cochin 🔥
In Cinemas soon 🔜🔥 #PrithvirajSukumaran pic.twitter.com/ajI4WN09Bt
— AB George (@AbGeorge_) November 2, 2025