I, Nobody | పృథ్విరాజ్ సుకుమారన్ ‘I, Nobody’ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఇదే
I, Nobody | పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ నిస్సాం బషీర్ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం I, Nobody. నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
I, Nobody | పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న మాలీవుడ్ స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు పృథ్విరాజ్ సుకుమారన్. కంటెంట్‌తోపాటు పవర్ ఫుల్ యాక్టింగ్‌తో ఇంప్రెస్ చేస్తుంటాడీ మల్టీ టాలెంటెడ్ యాక్టర్. సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలతో ప్రేక్షకులను పలుకరించే ఈ స్టార్ హీరో యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పృథ్విరాజ్ సుకుమారన్ నిస్సాం బషీర్ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం I, Nobody. నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ పార్వతి తిరువొత్తు లీడింగ్ రోల్లో నటిస్తోంది.
ఈ మూవీ మలయాళంలో జులై 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా తెలుగులో కూడా సందడి చేయనుంది. ఈ చిత్రం జులై 10న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్నాయి. ఇటీవలే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. రాజు అనే సాధారణ బ్యాంక్ ఉద్యోగి కథ నేపథ్యంలో సినిమా రాబోతుంది.
అతి పెద్ద బ్యాంక్ దోపిడీలో నిందితుడిగా మారిన తర్వాత రాజు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి.. తన ఫ్యామిలీని రక్షించుకునే క్రమంలో పడ్డ ఇబ్బందులేంటి..? అనుకోని పరిస్థితుల్లో అతడు హింసామార్గాన్ని ఎలా ఎంచుకున్నాడనే అంశాల చుట్టూ సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్, టీజర్ హింట్ ఇచ్చేశాయి.
Malayalam’s Latest Sensation #iNobody is set to be Grand Release in Telugu on JULY 10th.
Bookings open very soon!
AP Release by @SravanthiMovies
Nizam Release by @MythriRelease @PrithviOfficial #NisamBasheer #SameerAbdulvahid #SupriyaMenon @e4echennai @cvsarathi… pic.twitter.com/w1WZR1EfJn— BA Raju’s Team (@baraju_SuperHit) July 4, 2026
Read Also :
CM Rekha Gupta: వర్క్ ఫ్రం హోమ్ ఎత్తివేస్తూ ఢిల్లీ సీఎం ఆదేశాలు
KTR | రేపు కన్నేపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించనున్న కేటీఆర్
కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

