Rajamouli – Mahesh Project | దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో పాటు మహేశ్ – రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. అయితే ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం. పృథ్వీరాజ్ తాజాగా పెట్టిన ఒక పోస్ట్.
పృథ్వీరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకోస్తూ.. ఒక దర్శకుడిగా నా చేతిలో ఉన్న అన్ని సినిమాలను ప్రస్తుతం పూర్తి చేశాను. ఆ సినిమాలకు సంబంధించిన మార్కెటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు నటుడిగా తెర మీద కనిపించేందుకు సన్నద్ధమవుతున్నాను. నాకు రాని భాషలో ప్రస్తుతం ఒక సినిమాలో నటించబోతున్నాను. ఇందులో భారీ డైలాగులు ఉన్నాయని తెలిసి కొంచెం ఆందోళనగా ఉందంటూ పృథ్వీరాజ్ రాసుకోచ్చాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన మహేశ్ అభిమానులు ఇది SSMB29 ప్రాజెక్ట్ అని పృథ్వీరాజ్ ఇన్‌డైరెక్ట్‌గా పోస్ట్ పెట్టి హింట్ ఇచ్చాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుందని సమాచారం.