కె.వి.ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో బిగ్‌బాస్ ఫేం పృథ్వీ, వైష్ణవి, యాసికాలతో కలిసి నటించిన చిత్రం ‘మహిష’. రమణారెడ్డి, మధుసూదన్‌రావు నిర్మాతలు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ మిషన్ భగీరథ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్, రంగారెడ్డి బ్యాంక్ ఛైర్మన్ బచ్చు బద్రినారాయణ, డాక్టర్ అనిల్ అతిథులుగా విచ్చేసి ఈ సినిమా ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. జనవరిలో సినిమా విడుదల చేస్తామని, అందరూ మెచ్చేలా సినిమా ఉంటుందని దర్శకుడు కె.వి.ప్రవీణ్ చెప్పారు.