యువ హీరోలు ప్రిన్స్, ఆగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కలి. శివ శేషు దర్శకుడు. రుద్ర క్రియేషన్స్ పతాకంపై లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘కలి పాత్ర చుట్టూ అల్లుకున్న కథాంశమిది.
ఆద్యంతం అనూహ్య మలుపులతో సాగుతుంది. థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలతో ప్రేక్షకులకు ఉత్కంఠను పంచుతుంది. యాక్షన్ ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అన్నారు. నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి, సంగీతం: జీవన్‌బాబు, సమర్పణ: కె.రాఘవేంద్రరెడ్డి, రచన-దర్శకత్వం: శివ శేషు.