సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల ఓ కీలక పాత్రను పోషించనుంది.
సోమవారం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘కథాగమనంలో అనన్య నాగళ్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నా ఈ సినిమాలో సాయిదుర్గతేజ్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఐశ్వర్యలక్ష్మి, జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, రచన-దర్శకత్వం: రోహిత్ కేపీ.