సాత్విక్‌వర్మ, ప్రీతి నేహా జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమిస్తున్నా’. భాను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కనకదుర్గారావు పప్పుల నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా నుంచి ‘ఎవరే నువ్వు..’ అనే పాటను అగ్ర హీరో విజయ్ సేతుపతి విడుదల చేసి చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందజేశారు. సిద్ధార్థ్ సాలూరి స్వరపరచిన ఈ పాటను పూర్ణచంద్ర రచించారు.
మ్యూజికల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని, ఓ జంట అందమైన ప్రేమప్రయాణానికి అద్దంపట్టే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: భాస్కర్ శ్యామల, సంభాషణలు: అనిల్ కుమార్ అచ్చు, దర్శకత్వం: భాను.