Baby | విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం బేబి (Baby). హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్ (Sai Rajesh) దర్శకత్వం వహిస్తున్నాడు. వైష్ణవి చైతన్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి ప్రేమిస్తున్నా అంటూ సాగే మూడో సాంగ్ అప్డేట్ అందించిన విషయం తెలిసిందే. ఈ అప్డేట్ ప్రకారం ప్రేమిస్తున్నా లిరికల్ వీడియో సాంగ్‌ను రష్మిక మందన్నా (Rashmika Mandanna) లాంఛ్ చేసింది.
సురేశ్ బనిశెట్టి లాంఛ్ రాసిన ఈ పాటను విజయ్ బల్గానిన్ కంపోజిషన్‌లో పీవీఎన్ఎస్ రోహిత్ పాడాడు.ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బేబి నుంచి ఇప్పటికే ఓ రెండు మేఘాలియా, దేవరాజా పాటలు నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి. బేబి చిత్రానికి విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే బేబి నుంచి లాంఛ్ చేసిన ఓ రెండు మేఘాలిలా, దేవరాజా యూట్యూబ్‌లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. బేబి టీజర్ కూడా సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. బేబి చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ దీంతోపాటు గమ్ గమ్ గణేశాలో కూడా నటిస్తున్నాడు.
ప్రేమిస్తున్నా లిరికల్ వీడియో సాంగ్..
#BabyTheMovie 3rd Single #Premisthunna OUT NOW 🥳
The Heart Breaking Song of the season that’ll sting your hearts is here 💔🎻
🎹 @VijaiBulganin
🎙️@PvnsRohit
✍️@sureshbanisetti@ananddeverkonda @viraj_ashwin @iamvaishnavi04 @sairazesh @SKNonline pic.twitter.com/JO7NYwSd6I— BA Raju’s Team (@baraju_SuperHit) May 16, 2023
దేవరాజా లిరికల్ వీడియో సాంగ్..
ఓ రెండు మేఘాలిలా లిరికల్ వీడియో సాంగ్..
బేబి టీజర్.. వీడియో