ప్రముఖ టాలీవుడ్ (Tollywood) నిర్మాత దిల్ రాజు మేనల్లుడు అశిష్ (Ashish Reddy) రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా రౌడీ బాయ్స్ (Rowdy Boys). హుషారు ఫేం హర్ష కొనుగంటి (Harsha Konuganti) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్. తాజాగా ఈ మూవీ నుంచి ప్రేమే ఆకాశమైతే (Preme Aakasamaithe) రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను విజయ్ దేవరకొండ లాంఛ్ చేశాడు.
ప్రేమే ఆకాశమైతే ఓ మై జాను…అందులో ఎగిరే పక్షులంట నువ్వు నేను అంటూ ఆశిష్, అనుపమ లవ్ ట్రాక్ సన్నివేశాలతో సాగుతున్న ఈ పాటను జాస్ప్రిత్ జాజ్ పాడాడు. శ్రీమణి రాసిన ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రాణం పోసిందని చెప్పాలి. రౌడీ బాయ్స్ చిత్రానికి ఈ పాట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రౌడీ బాయ్స్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజ్, శిరీష్ నిర్మిస్తుండగా.. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యూత్‌ఫుల్ కథాంశంతో తెరకెక్కుతున్న రౌడీ బాయ్స్ రషెస్ కు మంచి స్పందన వస్తోంది.
Happy to launch #PremeAakasam song from #RowdyBoys 🎶
— Vijay Deverakonda TOOFAN (@TheDeverakonda) October 20, 2021
Enjoy 😊
▶️ https://t.co/4GlD4fSr9P#Ashish @anupamahere @HarshaKonuganti @ThisisDSP @Madhie1 @SVC_official @adityamusic
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha | హీరో కోసం చూస్తున్న సమంత..!
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Preetham: ఆగని మాటల దాడి.. చైతూ స్పందించాలని కోరుతున్న సమంత స్టైలిస్ట్