Nivin Pauly | మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమమ్‌తో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నాడు నివిన్ పాలీ (Nivin Pauly). ఈ సినిమాతో తెలుగు నాట కూడా నివిన్ పాలీ పేరు మార్మోగిపోయింది. ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. నివిన్ పాలీ డిజిటిల్ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. Pharma టైటిల్‌తో తెరకెక్కుతున్న మలయాళ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీకి రెడీ అయ్యాడు నివిన్ పాలీ.
పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం Disney Plus Hotstar ప్రాజెక్టుగా వస్తున్న ఈ వెబ్‌సిరీస్‌ను పీఆర్ అరుణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంకా షూటింగ్ షురూ కాని ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రజిత్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌పై పూర్తి వివరాలు రాబోయే రోజుల్లో బయటకు రానున్నాయి. కృష్ణన్ సేతుకుమార్ నిర్మిస్తుండగా.. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.