రమణ సాకే నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. సత్య మార్క దర్శకుడు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ని నిర్మాత సి.కల్యాణ్ ఆవిష్కరించారు.
ట్రెండ్‌కి తగ్గట్టు దర్శకుడు సత్య మార్క ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నిర్మాత, కథానాయకుడు రమణ సాకే తెలిపారు. వనిత గౌడ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, జబర్దస్త్ ఫణి, రాణి, తదితరులు ఇతర పాత్రధారులు. సాకే నీరజ లక్ష్మి ఈ చిత్రానికి మరో నిర్మాత.