Preity Zinta | బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా తన క్యూట్‌నెస్‌తో పాటు నటనతో ఎంతగానో అలరించింది. 90లలో ప్రీతి జింతా ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు ఐపీఎల్లో పంజాబ్‌కి సహ యజమానిగా వ్యవహరిస్తుంది. అయితే ఇప్పుడు విరామం దొరకడంతో పిల్లలతో ఎంజాయ్ చేస్తుంది. జై మరియు జియాతో సరదాగా గడుపుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సంభాషిస్తూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది. AMA సెషన్ సందర్భంగా, ఒక అభిమాని ప్రీతిని “సాధారణ ప్రజలకు మీ గురించి తెలియని ఒక విషయం ఏమిటి అని ప్రశ్నించాడు.
దానికి ప్రీతి స్పందిస్తూ.. ఆలయాలలో , బాత్రూంలో, భద్రతా తనిఖీల సమయంలో ఫొటోలు తీస్తే ఇష్టం ఉండదు. ఈ సమయాలలో తప్ప మిగతా సమయంలో ఫొటో అడిగిన సమస్య ఉండదు. నా పిల్లల ఫోటోలు తీస్తే నాలోని ‘కాళి’ బయటకు వస్తుంది. నేను ఎంతో సరదా మనిషిని . నా అనుమతి లేకుండా వీడియోలు తీయోద్దు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైన నన్ను నేరుగా అడగండి, దయచేసి నా పిల్లలను వదిలేయండి అంటూ ప్రీతి జింతా చెప్పుకొచ్చింది. చాట్ ముగింపులో అందరికీ ధన్యవాదాలు అంటూ తెలిజయేసింది ప్రీతి జింతా.
అయితే ఈ చాట్ నాకు చాలా ఇష్టంటా ఉంటుంది. ప్రశ్నలు చాలా బాగుంటాయి. వింతగా ఉంటాయి.మీడియా వారు నేను చెప్పిన విషయాలు మొత్తం రాయాలి, కట్ చేసి రాయోద్దు అంటూ ప్రీతి జింతా కోరింది. ప్రీతి జింతా హిందీతో పాటు తెలుగు సినిమాలలో నటించింది. దిల్ సే.. చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ అదే సంవత్సరం సోల్జర్ చిత్రంలో కూడా నటించారు. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. క్యా కెహనా (2000), దిల్ చాహ్తా హై (2001), కల్ హో నా హో (2003) చిత్రాలతో కూడా అలరించింది. తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తన అందం, ముఖ్యంగా ఆమె చిరునవ్వుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.. ప్రీతి జింటా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె 2016లో అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్ఎనఫ్ను వివాహం చేసుకున్నారు. దంపతులకు 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలు జన్మించారు. వీరికి ఒక బాబు (జై) , ఒక పాప (జియా) ఉన్నారు.