Game Changer | రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి కొత్త అప్డేట్ వెలువడింది. డిసెంబర్ 21న అమెరికాలోకి టెక్సాస్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.
ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరుకాబోతున్నారు. అమెరికాలో ఇప్పటివరకు తెలుగు సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ జరగలేదని, ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌ను అత్యంత భారీ స్థాయిలో అందరికి గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలై పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందనల లభించడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందించారు.